»   » సూర్య ‘24’ రిలీజ్ డేట్ ఖరారైంది

సూర్య ‘24’ రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ‘24' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నెలలోనే పూర్తయింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

దర్శకుడు విక్రమ్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసిన ఏప్రిల్ 14వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రిలీజ్ రైట్స్ హీరో నితిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Suriya’s 24 gets its releasing on April 14

సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. మన ఊహకు అందని విధంగా ఈ సినిమాలో సూర్య కనిపించబోతున్నారు. తాజాగా సూర్య వీల్ చైర్ లో కూర్చున్న లుక్ విడుదల చేసారు. చూడటానికి ఈ లుక్ కాస్త భయంకరంగానే ఉంది. ఈ చిత్రంలో సూర్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ప్రాతలు పోషిస్తున్నాడు.

సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరో వైపు ఈ సినిమా కథ లీకైందంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. '24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడట సూర్య.

English summary
Suriya’s 24 gets its releasing on April 14. The sci-fi thriller has been creating a lot of buzz ever since the film’s strikingly interesting posters were unveiled.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu