»   »  మహేష్ చేయాల్సిన సినిమా... సూర్య చేతికి ఎలా వెళ్లింది?

మహేష్ చేయాల్సిన సినిమా... సూర్య చేతికి ఎలా వెళ్లింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా వస్తున్న ‘24' సినిమా రోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళంలో అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు చాలా సంస్థలు పెద్ద మొత్తంతో పోటీకి దిగాయి.

వాస్తవానికి ఈ సినిమా తెలుగులో మహేష్ బాబు చేయాల్సింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తొలుత ఈ సినిమా స్క్రిప్టును మహేష్ బాబుకే వినిపించారు. తొలి భాగం వరకు మహేస్ బాబుకు నచ్చినా....సెకండాఫ్ నచ్చక పోవడంతో రిజిజెక్ట్ చేసారట. తర్వాత ఇదే కథతో దర్శకుడు సూర్యను ఆశ్రయించడం, సూర్య ఎకే చెప్పడం అలా జరిగి పోయింది.

Suriya's '24' Was First Offered To Mahesh Babu

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని సమాచారం.

శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ '24' సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. '13బీ', ‘ఇష్క్', ‘మనం' చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ '24' సినిమాతో ఓ సైన్స్ ఫిక్షన్‌ కథ ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేందుకు సిద్ధం కానున్నారట. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సూర్య సన్నాహాలు చేస్తున్నారు.

English summary
"Director Vikram Kumar had originally approached Mahesh with the script. He read it and really liked the first half. However, he was not happy with the second half and, hence, turned down the offer, which eventually was lapped up by Suriya," the source told IANS.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu