బందోబస్త్ ట్విట్టర్ రివ్యూ: ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు
సూర్య హీరోగా 'రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'బందోబస్త్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కాప్పన్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'బందోబస్తు' పేరుతో విడుదల చేశారు. మోహన్ లాల్, ఆర్యలు కీలకపాత్రల్లో నటించారు. యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలిపారు. ఆ వివరాలు చూస్తే..
ట్విస్ట్స్ బాగున్నాయి కానీ
కాప్పాన్ కాస్త డిసప్పాయింట్ చేసింది. సినిమాలో ట్విస్ట్స్ బాగున్నాయి కానీ ఉహాజనితంగానే ఉన్నాయి. క్లైమాక్ డీసెంట్ గా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఆవేరేజ్ సినిమా.
సూర్య పర్‌ఫార్‌మెన్స్, మోహన్ లాల్ స్క్రీన్ ప్రెసెన్స్
కాప్పాన్ మేకింగ్ బాగానే ఉంది. సూర్య పర్‌ఫార్‌మెన్స్, స్టెంట్స్ బాగున్నాయి. మోహన్ లాల్ స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్. టెక్నికల్ గా ఈ సినిమా సూపర్. స్టన్నింగ్ విజువల్స్. కొరియోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
కేవీ ఆనంద్ కథ, సూర్య హార్డ్ వర్క్
ఈ సినిమా కోసం సూర్య హార్డ్ వర్క్ చేశాడు. కేవీ ఆనంద్ కథను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి.
ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు
కాప్పాన్ సినిమాలో నటించిన అందరు నటీనటులు అదరగొట్టేశారు. నిజంగా సినిమా మొత్తంలో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు. సూర్య మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
రేసీ స్క్రీన్ ప్లే
రేసీ స్క్రీన్ ప్లే.. మాస్టర్ డ్రమాటిక్ సినిమా. సూర్య నటన అబ్బురపరిచింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రధాని పాత్రలో మోహన్ లాల్ జీవించాడు.


Click it and Unblock the Notifications











