మెగా ప్రాజెక్ట్: సూర్య-మురుగదాస్ తెలుగు మూవీ

ప్రస్తుతం సూర్య 'అంజాన్' (తెలుగులో సికిందర్) సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. సికిందర్ సినిమాకు సూర్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగులో సూర్యకి మంచి మార్కెట్ ఉండటం, అలాగే ఎన్టీఆర్ రభసకు పోటీగా ఈ చిత్రం వస్తుండటం హాట్ టాపిక్ అయింది. లింగు స్వామి ఈ చిత్రాన్ని ఓ రేంజిలో తీసాడని తమిళంలో టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్లే తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ భారీ మొత్తం ఇచ్చి మంచి పోటీలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకోవటం వార్తల్లో నిలిచింది. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











