ఎన్‌జీకే అడ్వాన్స్ బుకింగ్ సంచలనం.. విడుదలకు ముందే రికార్డులు తిరుగరాస్తున్న సూర్య
తమిళ సూపర్ స్టార్ సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్న NGK (నంద గోపాల కృష్ణ) చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది.
తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానులు పోటెత్తారు. తొలి రోజే 10 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి అని తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది. రేపటి నుంచి మరికొన్ని థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్‌ను మొదలుపెడుతాయి అని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిసున్న ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది.

తొలి రోజు తొలి ఆట కోసం బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఉదయం 4 గంటల సమయానికే ఆట మొదలుపెట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొన్నారు అని అసోసియేసన్ వెల్లడించింది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాపై తమిళ, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











