twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత చేతికి NGK హక్కులు.. ఫ్యాన్సీ రేటుకు సూర్య మూవీ.. మే 31న..

    |

    విలక్షణ నటుడు సూర్య నటించిన NGK (నంద గోపాల కృష్ణ) చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. 'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇప్పటికే NGK మూవీ టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌‌తో సినిమా మరింత క్రేజ్ పరిగింది. అలాంటి గొప్ప క్రేజ్‌ను సొంతం చేసుకొన్న ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

     Suriyas NGK movie to release on May 31st

    తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు కేకే రాధామోహన్ దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఫీల్‌గుడ్ సినిమాలను కేకే రాధామోహన్ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా సినిమాపై హైప్ ఉండటంతో భారీ ధరను చెల్లించినట్టు సమాచారం.

    ఎన్‌జీకే సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.

    English summary
    Suriya who has different image and is quite popular with his films 'Gajini' and 'Singam' Series is coming with an interesting political thriller 'NGK' (Nanda Gopala Krishna). '7G Brindavana Colony', 'Aadavari Matalaku Ardaale Verule' fame Sri Raghava is directing this film while SR Prakash Babu, SR Prabhu are producing under Dreamwarrior Pictures along with Reliance Entertainments. This movie set to release on May 31st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X