Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రముఖ నిర్మాత చేతికి NGK హక్కులు.. ఫ్యాన్సీ రేటుకు సూర్య మూవీ.. మే 31న..
విలక్షణ నటుడు సూర్య నటించిన NGK (నంద గోపాల కృష్ణ) చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. 'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే NGK మూవీ టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌తో సినిమా మరింత క్రేజ్ పరిగింది. అలాంటి గొప్ప క్రేజ్‌ను సొంతం చేసుకొన్న ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు కేకే రాధామోహన్ దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఫీల్‌గుడ్ సినిమాలను కేకే రాధామోహన్ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా సినిమాపై హైప్ ఉండటంతో భారీ ధరను చెల్లించినట్టు సమాచారం.
ఎన్జీకే సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.