NGK ట్రైలర్: రేయ్ అది శ్మశానం.. లోనికి వెళితే శవంగానే.. అదరగొట్టేసిన సూర్య!
సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్జీకే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కితున్నారు. మే 31న ఎన్జీకే చిత్రాలు తెలుగు తమిళ భాషలో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీకే చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో సూర్య అదరగొడుతున్నాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆసక్తి రేపుతున్న ఎన్జీకే చిత్ర ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం!

రేయ్ అది శ్మశానం
ట్రైలర్ ఆరంభంలో.. ఎన్జీకే.. ఎన్జీకే అంటూ నినాదాలు వినిపిస్తాయి. సూర్య మాస్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నాడు. ' చిన్న గుంపుని ఏసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారని అనుకున్నావా' అనే డైలాగ్ వినిపిస్తుంది. సూర్య తల్లి అతడి రాజకీయాలపై భయపడుతూ కనిపిస్తుంది. రేయ్ అది శ్మశానం.. లోనికి వెళితే శవంగానే బయటకు వచ్చేది అంటూ ఏడుస్తూ చెబుతుంది. సూర్య చేస్తున్న పోరాటాలు, పొలిటికల్ సెటప్ ని ట్రైలర్ లో బాగా చూపించారు.

బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకుని
హీరోయిన్ సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. మనం స్వాతంత్య్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకుని రాజకీయ నాయకులకు ఇచ్చేశాం అని చెబుతుంది. చదువుకున్న వారంతామనకెందుకులే అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది అంటూ బ్యాగ్రౌండ్ లో ఎమోషనల్ డైలాగ్ వినిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలని కూడా చక్కగా డిజైన్ చేశారు. సినిమా మొత్తం సూర్య నటన ఎమోషనల్ గా, పవర్ ఫుల్ గా సాగబోతున్నట్లు తెలుస్తోంది.

నిలదీసి అడిగే హక్కుంది
సూర్య ఒళ్ళంతా గాయాలతో కనిపిస్తూ వేదిపై ప్రసంగించే సన్నివేశంలో కనిపించాడు. రక్తం చిందించి ధాన్యం పండించే రైతుకి, దేశం బాగుండాలని కష్టపడే కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కుంది రా అంటూ సూర్య అద్భుతమైన డైలాగులు చెబుతున్నాడు. ఈ చిత్రంలో సూర్య పాత్ర పేరు నందగోపాల్ కృష్ణ.
రాజకీయ వ్యవస్థపై
ఎన్జీకే ట్రైలర్ చూస్తుంటే.. పాడైపోయిన రాజకీయ వ్యవస్థపై దర్శకుడు సెల్వరాఘవన్ సంధిస్తున్న అస్త్రంలా కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ సూర్య నటనతో ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఎక్కువగా ఉంది. పైగా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. సింపుల్ గా ఉన్న సూర్య లుక్ మాస్ అభిమానులకు నచ్చే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications











