»   » ‘సింగం 3’: వైజాగ్‌లో బీచ్ రోడ్డులో హీరో సూర్య టీం హల్ చల్ (ఫోటోస్)

‘సింగం 3’: వైజాగ్‌లో బీచ్ రోడ్డులో హీరో సూర్య టీం హల్ చల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య నటించిన సింగం, సింగం 2 సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూడో చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పటిలాగే ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ కాగా....మరో హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లో మొదలైంది. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుగబోతోంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్లోనే వైజాగ్ లో షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యం అయింది.

వైజాగ్ బీచ్ రోడ్డులో 'సింగం-3' సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది. పోలీసు వాహనాల్లో సూర్య, మరికొందరు ఆర్టిస్టులు దిగి హడావుడి చేయడం చూసి అక్కడ ఉన్న ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. అయితే అయితే అది షూటింగ్ అని తెలియడంతో చిత్రీకరణ పూర్తయ్యే వరకు షూటింగ్ చూస్తూ అక్కడే ఉండి పోయారు.

ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ముందే షూటింగ్ అని తెలిస్తే జనం బాగా పోగవుతారనే ఉద్దేశ్యంతో....సైలెంటుగా వచ్చి సీన్ పూర్తి చేసారు. ఈ సందర్భంగా లోకల్ పోలీసులు బందోబస్తు కల్పించారు.

స్లైడ్ షోలో ఫోటోస్..

తమిళంతో పాటు తెలుగులోనూ హిట్

తమిళంతో పాటు తెలుగులోనూ హిట్

సూర్య నటించిన ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం) సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

షూటింగ్

షూటింగ్

ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ‘సింగం 3' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఫారిన్ షెడ్యూల్

ఫారిన్ షెడ్యూల్

ఆ మధ్య ఫారిన్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్, ఆ తరువాత చెన్నై, చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు మదనపల్లి దగ్గర ఓ క్వారీ వద్ద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

వైజాగ్‌లో...

వైజాగ్‌లో...

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.

హరి

హరి

తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరి నే మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తుండగా, స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య నిర్మిస్తోన్న 'సింగం 3' సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.

English summary
Actor Suriya, popular both in the Tamil and Telugu industries, was recently spotted in Visakhapatnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu