Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకిస్తున్న సూర్య 'బ్రదర్శ్' బిజినెస్
హైదరాబాద్ : సూర్య, కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రదర్శ్ అనే టైటిల్ పెట్టి బెల్లంకొండ సురేష్ తెలుగుకు అనువదిస్తున్న సంగతి తెలిసిందే. బిజినెస్‌పరంగా ఈ సినిమా సంచలనం కలిగిస్తూ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమా తెలుగులో రిలీజుకు ముందే 20 కోట్లపైన బిజినెస్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. కేవలం శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారానే నాలుగున్నర కోట్లు తెలుగులో ఈ సినిమా సాధిస్తుందని తెలుస్తోంది. తెలుగులో పెద్ద హీరోలతో సమానంగా బిజినెస్ చేస్తున్న ఈ డబ్బింగ్ సినిమా హాట్ టాపిక్ గా మారింది.
గతంలో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ చిత్రం మిక్సెడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా,ఓపినింగ్స్ పరంగా మంచి రెవిన్యూ తెచ్చి పెట్టింది. దాంతో ఈ చిత్రానికి సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. 'రంగం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కె.వి.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూండటం కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి అదో ముఖ్యకారణం.
బ్రదర్స్ సినిమా, ఎమ్జీఆర్ చిత్రంలా అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంటుందని ఆ చిత్ర హీరో సూర్య వెల్లడించారు. ఈయన అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం మాట్రాన్. ర్య మాట్లాడుతూ... మాట్రాన్లో ప్రతి సన్నివేశంలో నటించ డం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు మాట్రాన్ చిత్రం లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. మాట్రాన్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు.
ర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఆ విధంగా మాట్రాన్ తెరకెక్కిందని వివరించారు. ఒక పాట మినహా చిత్రం పూర్తి అయ్యిందని చెప్పారు. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ జరుగుతున్నాయని తెలిపారు.