లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు సింగర్ గీతా మాధురి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు నటుడు నందుతో ఆమె వివాహం జరిగింది. వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. సాధారణంగా పెళ్లికి ముందు ప్రేమించుకున్న జంటల్లో పెళ్లి తర్వాత ప్రేమ శాతం తగ్గుతుందని అంటుంటారు. పెళ్లికి ముందు గిఫ్టులు, సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తే ప్రేమికులు చాలా మంది పెళ్లయిన తర్వాత గిఫ్టులు ఇవ్వడం తగ్గించేస్తుంటారు.
కానీ గీతామాధురి-నందు విషయంలో మాత్రం అలా కాదు. పెళ్లి తర్వాత ఈ దంపతుల మధ్య ప్రేమ శాతం మరింత పెరిగింది. ఇటీవల గీతా మాధురి బర్త్ డే సందర్భంగా ఏకంగా కారును గిఫ్టుగా ఇచ్చాడు. దాదాపు రూ. 10 లక్షల విలువ చేసే హ్యుందయ్ ఫ్లూయిడిక్ కారును తన ప్రియసి కం అర్దాంగి అయిన గీతా మాధురికి గిఫ్టుగా ఇచ్చాడు.
సైల్డ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

గీతా మాధురి
నందు తనకు బర్త్ డే గిఫ్టుగా కారు ఇచ్చాడంటూ గీతా మాధురి తన సోషల్ నెట్వర్కింగులో ఫోటోలు పోస్టు చేసింది.

కేక్ కట్టింగ్
తెలుగు క్యాలెండ్ ప్రకారం నందు, గీతా మాధురి బర్త్ డే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వచ్చిందట. దీంతో ఇద్దరం తొలిసారి ఒకేసారి కేక్ కట్ చేసామని గీతా మాధురి సోషల్ నెట్వర్కింగులో చెప్పుకొచ్చారు.

టూ వీలర్‌పై
చాలా రోజుల తర్వాత రికార్డింగు కోసం టూ వీలర్‌పై వచ్చాం. ఫీలింగ్ నైస్ అంటూ గీతా మాధురి ఈ ఫోటో పోస్టు చేసారు.

నందు, గీతా మాధురి
గీతా మాధురి, నందు వివాహం ఫిబ్రవరిలో జరిగింది. పెళ్లికి ముందు నుండే గీతా మాధురి, నందు ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకారంతో జీవిత భాగస్వాములయ్యారు.

నందు
నటుడిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'ఫోటో' సినిమాతో తెరంగేట్రం చేసారు. ఇటీవల విడుదలైన ‘ఆటో నగర్ సూర్య' చిత్రంలో కిచ్చా పాత్రలో నందు తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘ఐస్ క్రీం 2' చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











