twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యపోయి షాకైన రాజమౌళి

    By Srikanya
    |

    రాజమౌళి తాజా చిత్రం ఈగ విషయమై ఆయన ఆశ్చర్యపోతూ,షాక్ అయ్యానంటూ ట్వీట్ చేసారు. ఆ చిత్రం ట్రైలర్ ఇంకా విడుదలకాకపోయినా ఫేక్ ట్రైలర్ యూ ట్యూబ్ లో తిరిగుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటికి లక్షా యాభైవేల మంది పైగా చూసారు. ఇది గమనించిన ఆయన ట్విట్టర్ లో ...ఇప్పటివరకూ లక్షా యాభై వేల మంది పైగా ఈ ఫేక్ ట్రైలర్ ని చూసారు. దీన్ని ఓ అబిమాని సరదాగా ఫన్ కోసం యూ ట్యూబ్ లో పెట్టారు. ఈగ ట్రైలర్ అని పెట్టడటంతో అంతా ఒరిజనల్ అనుకుని చూస్తున్నారని అన్నారు. ఈ మధ్యన ప్రతీ తెలుగు చిత్రంకు చెందిన ఫేక్ ట్రైలర్స్,ఫస్ట్ లుక్ లు నెట్ లో వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత సినిమా దర్సకులు వాటిని చూసుకుని అది మేము తయారు చేసింది కాదు అని వివరణ ఇచ్చుకుంటున్నారు.

    ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    నాని, సమంత జంటగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రూపొందుతోంది. అని చెప్పారు రాజమౌళి. ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫౌల్డ్స్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ:ఎస్. రవీందర్, స్పెషల్ ఎఫెక్ట్స్: అడిల్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

    English summary
    Rajamouli tweeted as---more than1,50,000 views for a fan made fun trailer of eega on youtube.after naming it "eega"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X