For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ ఆరోపణ :డైరక్టర్ నాతో పడుకోవాలన్నాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : నా జీవితంలో ఒకానొక ఫేజ్ లో ప్రతీ రోజు చాలా ఇండీసెంట్ ప్రపోజల్స్ ని ఎదుర్కొన్నాను. అదృష్టవశాత్తు అవేమీ ముంబైలో ఎదురుకాలేదు. అయితే సౌత్ లో మాత్రం టాప్ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరక్టర్ కు ఏజెంట్ ని చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం అలాంటి ప్రపోజల్ పెట్టాడు. మా సార్ నీతో సినిమా జరుగుతున్నంత సేపూ రిలేషన్ పెట్టుకుంటారు..నువ్వు నీ క్యారెక్టర్ ని బాగా అర్దం చేసుకోవటానికి అది కుదురుతుంది...ఇష్టమైతే చెప్పు అంటూ ఆఫర్ ఇచ్చాడు. కానీ తిరస్కరించాను అంటోంది సుర్విన్ చావ్లా. హేట్ స్టోరీ 2 తో పాపులర్ అయిన ఆమె తెలుగులో రాజు-మహారాజు చిత్రం చేసింది.

  ఆమె మాట్లాడుతూ... ఎప్పుడైతే అలాంటి రిలేషన్ అంటూ మీడియేటర్ అలాంటి ప్రపోజల్ పెట్టాడో అప్పుడే అర్దమైంది...ఆ డైరక్టర్ నాతో పడుకోవాలని అడుగుతున్నాడని, వెంటనే నేను ఎవరితో ఉండాలో అక్కర్లేదో ఎవరూ డిసైడ్ చేయక్కర్లేదు..నువ్వు నోరు మూసుకో అన్నాను..అంటూ చెప్పుకొచ్చింది. సౌత్ డౌరక్టర్ అంటూ ఆమె చేసిన ఈ ఆరోపణలు ఏ దర్శకుడు గురించి అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రిలో రకరకాల గుసగుసలకు దారి తీసింది.

  Surveen Chawla's Shocking Comments On South Director

  ఇంతకు ముందు కూడా ఆమె బికినీ వేస్తే తప్పేంటి అంటూ మీడియా వద్ద ప్రశ్న వేసి వార్తల్లో నిలిచింది. బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ తిరుప్పంగళ్ చిత్రంలో నటించారు. తాజాగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న జైహింద్-2 లో హీరోయిన్ ఈ అమ్మడే. బాలీవుడ్‌లో హిమ్మత్ వాలా చిత్రంలో చిన్న వేషంలో మెరిసిన సుర్విన్ చావ్లా ప్రస్తుతం దక్షిణాది చిత్రాలనే నమ్ముకుందట.

  సుర్విన్ మాట్లాడుతూ.... అర్జున్ జైహింద్-2 చిత్రంలో హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రం తన నటనకు కచ్చితంగా ప్రశంసలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తెరపైకొచ్చిన హేట్ స్టోరీ - 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది.

  ఇందులో హీరో జైతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడం గురించి అడుగుతున్నారని, అయితే నటుడు జై తనకు ఇంతకు ముందే తెలుసునని అందువల్ల రొమాన్స్ సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పింది. అలాంటి సన్నివేశాల్లో బికినీ దుస్తులు ధరించి నటించడానికి సంకోచించలేదని చెప్పింది. కథలో అది ఒక భాగం అవడంతో బికినీ దుస్తులు ధరించడానికి నో చెప్పలేదని, అయినా అందులో తప్పేముందని సుర్విన్ చావ్లా అంటోంది.

  English summary
  “Surveen Chawla lead lady in 'Hate Story 2', accused that there is casting couch existing in Southern film industries. "During one phase of my life I was getting indecent proposals every day. Thankfully, it didn’t happen in Mumbai. But when I was in the South, I met this guy who was acting as a agent of one top National Award winning director. This mediator told me that ‘Sir’ wanted to have a relationship with me for the duration of the film, just to understand me better and for the betterment of my role. I asked him whether he was telling me to sleep with the guy. I told him he couldn’t force me to sleep with anyone and that it remained my choice. That shut him up.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X