రెండేళ్ల తర్వాత బహిర్గతం: హీరోయిన్ రహస్య పెళ్లి ఫోటోలు ఇవే...

By Bojja Kumar

Recommended Video

హీరోయిన్ రహస్య వివాహం..!

బాలీవుడ్ హీరోయిన్ సుర్వీన్ చావ్లా తనకు పెళ్లయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లి రెండేళ్ల క్రితం 2015లో జరిగిందని ఆమె స్వయంగా చెప్పడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, అభిమానులు షాకయ్యారు. ఈ విషయమై సుర్వీన్ చావ్లా స్పందిస్తూ.... వ్యక్తిగత కారణాల వల్లనే ఇంతకాలం తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సుర్వీన్ తెలిపారు. ఇటలీలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలు తాజాగా ఆమె విడుదల చేశారు.

 భర్త అక్షయ్ ఠక్కర్ గురించి

భర్త అక్షయ్ ఠక్కర్ గురించి

అక్షయ్ ఠక్కర్ తనకు చాలా కాలంగా తెలుసని, ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుర్వీన్ చావ్లా తెలిపారు.

ప్రకటించాలనుకునే లోపు ఫ్యామిలీలో విషాదం

ప్రకటించాలనుకునే లోపు ఫ్యామిలీలో విషాదం

2017లో ఇండియన్ సాంప్రదాయంలో మళ్లీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు ఇటలీ వైట్ గౌన్ వెడ్డింగ్ గురించి ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆలోపే మా ఫ్యామిలీలో ఒకరు మరణించారు. అందుకే తమ ఇండియన్ వెడ్డింగ్ 2018కి వాయిదా వేసినట్లు సుర్వీన్ చావ్లా తెలిపారు.

 కెరీర్ మీద ప్రభావం పడుతుందనే

కెరీర్ మీద ప్రభావం పడుతుందనే

2015లో పెళ్లి సమయానికి సుర్వీన్ చావ్లా వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఈ సమయంలో తన పెళ్లి జరిగినట్లు తెలిస్తే అవకాశాలు తగ్గిపోతాయనే ఆలోచనతోనే సుర్వీన్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు చర్చించుకుంటున్నారు.

 సినిమాల్లోకి....

సినిమాల్లోకి....

టీవీ నటిగా సుర్వీన్ చావ్లా కెరీర్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 2008లో ‘పరమేశ పాన్ వాలా' అనే కన్నడ చిత్రంలో తొలి అవకాశం దక్కించుకుంది. ఆ వెంటనే తెలుగులో మోహన్ బాబు, శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిచిన ‘రాజు మహారాజు' చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెకు కెరీర్ పరంగా హెల్ప్ అవ్వలేదు.

 హిందీ, పంజాబీ చిత్రాలతో పాపులర్

హిందీ, పంజాబీ చిత్రాలతో పాపులర్

హిందీ, పంజాబీ చిత్రాలతో సుర్వీన్ చావ్లా పాపులర్ అయింది. 2014లో వచ్చిన హేట్ స్టోరీ 2 మూవీలో బోల్డ్‌గా నటించి హాట్ టాపిక్ అయింది. సుర్వీన్ నటించిన చివరి సినిమా ‘పార్చ్‌డ్' 2015లో విడుదలైంది. ప్రస్తుతం ఆమె ఛురి అనే హిందీ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X