పకడ్బందీ స్క్రిప్టుతో వస్తే నటించేందుకు సిద్ధమే : సూర్య
సూర్య నటించిన 'సింగం' ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. గతంలో వచ్చిన 'యముడు'కి ఇది సీక్వెల్. ఈ చిత్రం రిలీజైన మొదటి రోజే రికార్డు ఓపినింగ్స్ తో విడుదలైంది. అలాగే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన తెలుగు మీడియాతో మాట్లాడారు.
ఇక ''దక్షిణాదిలో సీక్వెల్ చిత్రాలకు విజయం దక్కదని అందరూ అంటారు. నేను 'సింగం'లో నటించడం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అన్నారు. కానీ నాకు దర్శకుడు హరి మీద నమ్మకం ఉంది. అనుకున్న దాన్ని ఆయన బాగా తెరకెక్కించగలరు. దర్శకుడి మీద ఉంచిన నమ్మకం నిజమైంది. మమ్మల్ని నిరాశపరిచిన వారి మాటలు కేవలం అపోహలే అని తేలిపోయాయి''అన్నారు సూర్య.
అలాగే ''ఇంతకు ముందు వచ్చిన 'యముడు', ఇప్పుడు విడుదలైన 'సింగం' సినిమాల్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేను. మీరు చిన్నప్పుడు అందంగా ఉన్నారా.. పెద్దయ్యాక బాగున్నారా అంటే చెప్పగలరా.. ఇదీ అంతే. యముడులో నరసింహం ఓ ఎస్సైగా జీవితం మొదలుపెడతాడు.. ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరతాడు. అందులో కేవలం రాష్ట్రంలో జరిగే ఘటనలను అడ్డుకుంటాడు. 'సింగం'లో మన దేశంలో జరిగే విదేశీ మాఫియా కార్యకలాపాల్ని అడ్డుకుంటాడు. ఏ సినిమాకి ఆ సినిమానే బాగున్నాయి. రెండింటిలోనూ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












