స్టేజీపై అనూష్క అదిరిపోయే డాన్స్ ...(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : సూర్య- అనుష్క జంటగా అప్పట్లో విజయవంతం అయిన తమిళ చిత్రం 'సింగం' తెలుగులో 'యముడు' పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు నాట కూడా ఈచిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా తమిళంలో 'సింగం' చిత్రానికి సీక్వెల్‌గా 'సింగం-2' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కూడా తెలుగులో విడుదల అవుతోంది. టైటిల్ 'సింగం'. ఈ చిత్రం ఆడియో పంక్షన్ ..నిన్న ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఆడియో పంక్షన్ కి సూర్య సోదరుడు కార్తీ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఆడియో పంక్షన్ ని చాలా ఘనంగా ప్రిన్స్ పిక్చర్స్ వారు చేసారు. అలాగే శ్రీను వైట్ల ఈ పంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా వచ్చి ఆడియోని ఆవిష్కరించారు.
చిత్రం ఘన విజయం సాధిస్తుందని అంతా అభిలషించారు. అనూష్క ఈ పంక్షన్ లో సెంటరాఫ్ ఎంట్రాక్షన్ గా నిలించింది. సూర్య చిత్రాలు స్ట్రైయిట్ చిత్రాల తరహాలో విడులవటం చాలా సంతోషంగా ఉందని గెస్ట్ లు అన్నారు.
ఆడియో పంక్షన్ హైలెట్స్ స్లైడ్ షో లో...

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా సింగం ఆడియో లాంచ్ అయ్యింది.

అనూష్క,శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా ఎక్సపెక్ట్ చేసేలా కలిసిపోయారు.

దేవిశ్రీప్రసాద్ ..స్టార్ ఆఫ్ ది నైట్ అయ్యారు.

శ్రీనువైట్లను తమిళ,తెలుగు సినిమా ప్లాన్ చేయచ్చుకదా అన్నట్లు...సూర్య

అందరి దృష్టీ ఈ ముగ్గరుపై ..వీళ్ల దృష్టి మాత్రం స్టేజీపై ..

ఇద్దరు హీరోలతో..ఒకే హీరోయిన్...

తమిళ డబ్బింగ్ సినిమా అయినా జనం మాత్రం స్టైయిట్ సినిమా కి వచ్చినట్లు వచ్చారు.

స్టేజీపై డాన్స్ చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్..దాన్ని అనుసరిస్తూ..

తెరపైనే కాదు..స్టేజీపైనా అదరకొడతాం..

మాదే ఈ పంక్షన్... అన్నట్లు ఇద్దరూ ఉత్సాహంగా...

తెరపైనే కాదు..స్టేజీపైనా అదరకొట్టాలి అంటూ దేవిశ్రీప్రసాద్...

సినిమా..గత చిత్రం యముడులా ఘన విజయం సాధిస్తుందంటూ అనూష్క.

భాషాభేదం లేకుండా తన చిత్రాలు,అన్న చిత్రాలు ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ...

ఖచ్చితంగా అదరిపోయే సినిమా అవుతుందంటున్నాడు...

‘సింగం-2' చిత్రం ఇప్పుడు తెలుగులో ‘సింగం' పేరుతో విడుదల కాబోతోంది. హరి దర్శకత్వంలోప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నూతన నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications











