సూర్య 'యముడు' సీక్వెల్ కు తెలుగు టైటిల్ ఏమిటంటే..
మొదట అంతా ఈ చిత్రానికి యముడు-2 అని పెడతారనుకున్నారు. కాని సంగమ్ అని పెడితే ఫవర్ ఫుల్ గా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలవుస్తోంది. అంజలి ప్రత్యేక మైన పాట చేసిన ఈ చిత్రం తెలుగు ఫస్ట్ లక్, టీజర్ త్వరలో విడుదల కానుంది. తెలుగులోనూ యముడు రేంజిని దాటి హిట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే సినిమా రీమేక్ హక్కులపై బాలీవుడ్ నుంచి భారీ పోటీ నెలకొనడంతో ఎవరికీ విక్రయించక తనవద్దే పెట్టుకున్నాడట నిర్మాత. హిందీలోనూ ఆయనే విడుదల చేసే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సింగంలో అందాలను గుప్పించిన అనుష్క సింగం-2లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. మరింత గ్లామర్‌ను అందించడానికి మరో హీరోయిన్‌గా హన్సిక నటిస్తున్నారు.
సింగం చిత్రానికి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సీక్వెల్‌కు పని చేస్తున్నారు. ఈ మసాలా చిత్రం కోసం తొలిసారిగా విడుదల చేసిన పోస్టర్లు సూర్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












