‘బిజినెస్ మేన్’ ఆదారంగా...‘సూర్య భాయ్ టాయిలెట్స్’
మహేష్ బాబు హీరోగా వచ్చిన 'బిజినెస్ మేన్' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో 'ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చా' అంటూ మహేష్ బాబు కొట్టిన డైలాగ్ సినిమాకు తెగ పాపులారిటీ తెచ్చి పెట్టింది. బిజినెస్ మేన్ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 'సూర్య భాయ్ టాయ్ లెట్స్ అండ్ బాత్రూమ్స్' పేరుతో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్.....రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయకూడదు, మనం మనుషులం కాబట్టి నాగరికుల్లా ప్రవర్తిద్దాం' అనే సందేశాన్ని ఇస్తూ రూపొదించారు. ఓ వైపు సందేశాన్ని ఇస్తూ, మరో వైపు నవ్వు తెప్పిస్తూ ఉండటంతో ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశం అయింది.
బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు ముంబైలో సూర్య ఎక్స్ పోర్ట్స్ బిజినెస్ మొదలు పెడితే... ఇందులో ఓ వ్యక్తి ముంబైలో 'సూర్య భాయ్ టాయ్ లెట్స్ అండ్ బాత్రూమ్స్' బిజినెస్ మొదలు పెడతాడు. సినిమాలో మాదిరే ముంబై కేంద్రంగా సూర్య టాయ్ లెట్స్ ను దేశం మొత్తం విస్తరించాలని, ప్రతి బ్రాంచిలో ఇద్దరు స్టాఫ్, ఓ యాడిబ్ బాటిల్ రెండు చీపుర్లు, వారికి ఫిక్సిడ్ సాలరీలు ఇలా నవ్విస్తూ సాగుతుంది సదరు వీడియో.
మహేష్ బాబు-కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ రూపొందించిన 'బిజినెస్ మేన్' చిత్రం భారీ విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమలోనే టాప్ ఇండస్ట్రీ గ్రాసర్ గా నిలవడమే కాదు, అత్యధిక థియేటర్లలో రిలీజై రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











