‘గ్యాంగ్’తో పవన్ కళ్యాణ్ మూవీని ఢీకొట్టబోతున్న హీరో సూర్య!

By Bojja Kumar

Recommended Video

పవన్ తో పోటీ పడుతున్న గ్యాంగ్ ! | Filmibeat Telugu

సింగం 2 తర్వాత తమిళ హీరో సూర్య నటిస్తున్న చిత్రం 'తానా సెరెంద కూట్టమ్‌'. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ 'గ్యాంగ్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

తన గత సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సూర్య 'గ్యాంగ్' చిత్రంలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ మూవీతో సూర్య ఢీ

పవన్ కళ్యాణ్ మూవీతో సూర్య ఢీ

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు రెండ్రోల ముందే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరూ పెద్ద స్టార్లే కావడంతో బాక్సాఫీసు వద్ద రసవత్తరమైన పోటీ ఉండనుంది.

బాలీవుడ్ మూవీకి దగ్గరి పోలికలు

బాలీవుడ్ మూవీకి దగ్గరి పోలికలు

అక్షయ్‌ కుమార్‌ అప్పట్లో హిందీలో ‘స్పెషల్‌ 26' అనే చిత్రం చేశారు. ఈ చిత్రానికి ‘గ్యాంగ్' రీమేక్ కాక పోయినా... ఈ సినిమా కాన్సెప్టుతో స్పూర్తి పొంది ‘గ్యాంగ్' చిత్రాన్ని రూపొందించారట. సౌత్ స్టైల్‌లో ఈ చిత్రం ‘స్పెషల్‌ 26'కు భిన్నంగా ఉండబోతోంది.

తెలుగులో యూవీక్రియేషన్స్

తెలుగులో యూవీక్రియేషన్స్

ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. హీరో ప్రభాస్ స్నేహితులు రన్ చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ ‘గ్యాంగ్' చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ‘గ్యాంగ్‌' చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తమిళ టీజర్‌ను విడుదలైంది. ఇందులో రమ్యకృష్ణ సూర్యతో కలిసి లుంగి డ్యాన్స్‌ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు.

సూర్య సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్

సూర్య సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తనకంటూ ఓ అభిమాన వర్గాన్ని సూర్య తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరుచుకున్నారు. స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X