twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య ‘రఫ్’ ఆడియో రిలీజ్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆది, రకూల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ఎమ్.సుదర్శనరావు మాధవరం సమర్పణలో శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అభిలాష్ నిర్మాతగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రఫ్'. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి ఫంక్షన్ హాల్ లో జరిగింది.

    ఈ ఆడియో వేడుకకు తమిళ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య ఆడియో సీడీలను లాంఛ్ చేసి వంశీ పైడిపల్లికి అందజేసారు. బోయపాటి శ్రీను థియేట్రికల్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. వీరితో పాటు రానా, అల్లరి నరేష్, నితిన్, వంశీ పైడిపల్లి, దశరధ్, సంపత్ నంది, వీరభద్రం చౌదరి, కె.వి.వి.సత్యనారాయణ, డి.యస్.రావు, సురేష్ కొండేటి, రాధామోహన్, ఆర్.కె తదితరులతో పాటు ఈ చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

    స్లైడ్ షోలో ఆడియో వేడుక విశేషాలు, ఫోటోలు...

    సూర్య హీరో సూర్య మాట్లాడుతూ

    సూర్య హీరో సూర్య మాట్లాడుతూ

    ''సాయికుమార్ గారు డైలాగులు చెప్పడంలో స్పెషలిస్ట్. ఆ క్వాలిటీ ఆదికి కూడా వచ్చి ఉంటుంది. ట్రైలర్స్ ఆదిలోని స్కిల్స్, టాలెంట్ ని తెలియజేస్తున్నాయి. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ

    ''ఆది రఫ్ గా ఉన్నాడు. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు విజయం చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, చిత్రం యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను' అన్నారు.

    డైరెక్టర్ మాట్లాడుతూ...

    డైరెక్టర్ మాట్లాడుతూ...

    'అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఇది. ఇప్పటివరకూ ఆదిని లవర్ బోయ్ లానే చూసారు. 'రఫ్' ఆదిని యాక్షన్ హీరోగా ఆవిష్కరిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా నటించింది. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు.

    హీరో ఆది మాట్లాడుతూ

    హీరో ఆది మాట్లాడుతూ

    ''సూర్యగారు ఈ ఆడియో వేడుకకు రావడం ఆనందంగా ఉంది. పాండియన్ మాస్టర్ దగ్గర నేను ఫైట్స్ నేర్చుకున్నాను. ఆ మాస్టర్ దగ్గరే సూర్య కూడా ఫైట్స్ నేర్చుకున్నారు. పాండియన్ మాస్టర్ ఎప్పుడూ సూర్య గురించి చెప్పి, మమ్ముల్ని ప్రోత్సహిస్తుండే వారు. ఆ రకంగా సూర్య నాకు ఇన్సిఫిరేషన్ అయ్యారు. రఫ్ మంచి కథ ఇది. లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. చిరంజీవిగారి డ్యాన్సులంటే నాకు చాలా ఇష్టం. మణిశర్మగారి పాటలకు డ్యాన్స్ చేసేవాడిని. ఆయన సంగీతం అందించిన పాటలకు హీరోగా డ్యాన్స్ చేయడం నా కల నిజమయ్యింది' అన్నారు.

    నిర్మాత అభిలాష్ మాట్లాడుతూ

    నిర్మాత అభిలాష్ మాట్లాడుతూ

    ''భారీ వ్యయంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు కె.కె.సెంధిల్ కుమార్ కెమెరా, మణిశర్మ సంగీతం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్'' అన్నారు.

    సాయికుమార్ మాట్లాడుతూ

    సాయికుమార్ మాట్లాడుతూ

    ''ఆదికి 'రఫ్' యాక్షన్ ఇమేజ్ ని తెచ్చి పెడుతుంది. ఆది బాగా కష్టపడ్డాడు. ఈ సినిమా తనకు కమర్షియల్ బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాత అభిలాష్ కే దక్కుతుంది. తను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, అదుర్స్ రఘు, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - మరుధూరి రాజా, పాటలు - భాస్కర భట్ల, ఫైట్స్ - రామలక్ష్మణ్, డ్యాన్స్ - బాబా భాస్కర్, భాను, ఆర్ట్ - సీతారామాంజనేయులు, ఎడిటర్ - మార్తాండ్ .కె.వెంకటేష్, డి.ఓ.పి - కె. కె.సెంధిల్ కుమార్, అరుణ్ కుమార్, సంగీతం - మణిశర్మ, నిర్మాత - ఎమ్.అభిలాష్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సి.హెచ్.సుబ్బారెడ్డి.

    English summary
    Actor Aadi is on a high! There are two reasons for his joy, firstly Tamil actor Surya has released the audio of Aadi's upcoming movie Rough and praised the young actor's talent. Secondly, the actor got engaged to Aruna a software engineer who hails from Rajahmundry, Andhra Pradesh. The filmmakers and reports say, the movie will be his next promising hit after his earlier movie Prema Kaavali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X