లావు తగ్గడానికి ఆయనే స్పూర్తి...సునీల్
సూర్య నటించిన ప్రతి సినిమా చూశాను. చాలా బాగుంటాయి. నేను లావు తగ్గడానికి ఆయనే నాకు స్పూర్తి అంటున్నారు సునీల్. రీసెంట్ గా ఆయన 'సెవెంత్ సెన్స్' లోగో ఆవిష్కరణకు వచ్చి ఇలా స్పందించారు.'గజని' చిత్రం తరువాత హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సెవెంత్ సెన్స్'. ఆధునాతన సాంకేతిక విలువలతో, అత్యధిక వ్యయంతో తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది లక్ష్మీగణపతి ఫిలిమ్స్ సంస్థ. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సునీల్ లోగోని ఆవిష్కరించి ఇలా స్పందించారు. అలాగే ..ఈ చిత్రం విజయం సాధించి నిర్మాతలకు లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అన్నారు.నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'ఇంత మంచి సినిమాను నేను చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంతకుముందు 'గజని' సినిమా కూడా ఇలాగే మిస్ అయ్యాను.ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటే నాకు 'అవతార్' సినిమా గుర్తుకువస్తోంది. అన్ని భాషల్లో ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. దర్శకుడు మురుగదాసు మాట్లాడుతూ ' ఎనిమిది నెలలు రిసెర్చ్ చేసి ఈ చిత్రకథ తయారుచేశాను. 'గజని' కంటే నాలుగురెట్లు బాగుంటుంది. సినిమాలో ప్రారంభంలో వచ్చే పది నిముషాల కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. బడ్జెట్‌కు వెనుకాడకుండా అత్యంత భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందించడం జరిగింది' అన్నారు. ఇక ప్రస్తుతం సునీల్ వీరభద్ర చౌదరి దర్శకత్వంలో పూల రంగడు చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











