సూర్య కూడా ట్విట్టర్లో జాయినయ్యాడు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ట్విట్టర్లో జాయినైన సంగతి తెలిసిందే. ఆయన ట్విట్టర్లో చేరిన వెంటనే లక్షలాది మంది ఆయన్ను ఫాలో అవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో చేరని సౌతిండియా స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. తాజాగా సూర్య కూడా ట్విట్టర్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అతని సొంత సినీ నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టెన్మెంట్స్ ఖరారు చేసింది. @Suriya_offl ద్వారా అతని ఫాలో అవ్వొచ్చు.
సూర్యకు సౌతిండియా వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆయనకు ట్విట్టర్లో ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ లో రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారు రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరి సూర్య వారి రికార్డులను బద్దలు కొడతారో? లేదో? చూడాలి.

సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రి ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది. ఆమె నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ఈ రోజు ఉదయం @Suriya_offl ద్వారా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











