twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య, జ్యోతిక కిడ్నాప్‌

    By Staff
    |

    పెళ్లి చేసుకుని ఇంక సినిమాల్లో నటించనని జ్యోతిక ప్రకటించాక నీరసపడిపోయిన ఆమె అభిమానులుంటే ఇది శుభవార్త! జ్యోతిక సినిమాలు మరికొద్ది కాలం తెలుగులో వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. కనీసం మరో ఏడాది పాటు ఆమె అందాన్ని, అభినయాన్ని డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడానికి డబ్బింగ్‌ నిర్మాతలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ జంట పెళ్లయ్యాక మొట్టమొదటిగా విడుదలవుతున్న చిత్రం - కిడ్నాప్‌. ఇందులో హీరోయిన్‌ జ్యోతిక ఒక హీరోయిన్‌ పాత్ర పోషించగా, సూర్య ఒక మాస్‌ గెటప్‌లో ఆమెను కిడ్నాప్‌ చేస్తాడు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం వినోదం అందిస్తాయి. అలాగే ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా సమానంగా ఉంటాయి.

    తమిళంలో సుప్రసిద్ధ దర్శకుడు బాల (శివపుత్రుడు, సేతు.. ఫేమ్‌) ఈ చిత్రాన్ని సమర్పించారు. తమిళంలో మాయావి పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ మూవీస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది.

    కిడ్నాప్‌ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. భువనచంద్ర, సాహితి, వనమాలి పాటలు రాశారు. ఐదు పాటలు ఆణిముత్యాల్లా రూపొందాయని, నాలుగు ఫైట్స్‌ అన్ని వర్గాల వారిని అలరిస్తాయని నిర్మాతల్లో ఒకరైన యస్‌.వి. రావ్‌ తెలిపారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని ఈ చిత్రం సెప్టెంబర్‌ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతుంది.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X