కమల్ తో పాటు మరో స్టార్ హీరో తో 'భారతీయుడు -2' ఖరారు...

By Srikanya

హైదరాబాద్ : శంకర్,కమల్ కాంబినేషన్ లో పదిహేడేళ్ల కిందట వచ్చిన 'భారతీయుడు' చిత్రం ఇప్పటికీ అందరికి గుర్తే. ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అవినీతిపై యుద్దం ప్రకటించిన ఓ భారతీయుడు కథగా ..ఇప్పటికీ ఎవరైనా అవినీతి పై పోరాటం అంటే భారతీయుడు అనే పదం వాడేలా సినిమా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకి ఇప్పుడు రెండో భాగం రూపొందబోతోందా? అనే విషయమ్మీద గత కొద్ది రోజులుగా చెన్నై సినీ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకొంటున్నాయి. ఆ చిత్రంలో కమల్‌హాసన్‌ ప్రదర్శించిన వైవిధ్యభరితమైన నటన, దర్శకుడు శంకర్‌ కథను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొన్నాయి. ఇటీవలే కమల్‌, శంకర్‌ భేటీ జరిగింది. ఆ సందర్భంగా భారతీయుడు చిత్రానికి కొనసాగింపు చేయాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారని తెలిసింది.

అంతేకాదు ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య ఓ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందట. ఆస్కార్‌ రవిచంద్రన్‌ చిత్రాన్ని నిర్మిస్తారు. కమల్‌ నటిస్తున్న 'విశ్వరూపం-2', శంకర్‌ దర్శకత్వంలోని 'ఐ' (తెలుగులో మనోహరుడు) సినిమాలు పూర్తయ్యాక రెండో భారతీయుడు వివరాలు వెల్లడవుతాయి.

దీని గురించి శంకర్ చెబుతూ, 'ఇండియన్ -2" తీద్దామని నిర్మాత రవిచంద్రన్ చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అయితే, ప్రస్తుతం నేను చేస్తున్న ఐ కంప్లీట్ అయ్యాకనే దాని మీద ఓ నిర్ణయం తీసుకుంటాను" అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సాగే కథ కాబట్టి, ప్రస్తుత సమయంలో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే ఆదరణ ఉంటుందని శంకర్ భావిస్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X