twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లిద్దరూ అంటే నాకు స్పెషల్ క్రేజ్: కాజల్

    By Sindhu
    |

    చాలామంది హీరోలతో కలిసి వర్క్ చేసినా వాళ్లిద్దరూ మాత్రం నాకు స్పెషల్ అని అంటోంది పంజాబీ భామ కాజల్. వాళ్ళిద్దరూ ఎవరో కాదు. కోలీవుడ్ అన్నదమ్ములు సూర్య, కార్తీ. కార్తీ తో ఈ మధ్యనే 'నా పేరు శివ" సినిమాలో కన్సించిన కాజల్, ప్రస్తుతం సూర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. ఇద్దరూ ఇద్దరే..సినిమా విషయంలో వాళ్ళకున్న డెడికేషన్ అంతా ఇంతా కాదు...సూర్య, కార్తీలను చూసి చాలా నేర్చుకున్నాను..."అంటోన్న కాజల్ వాళ్లిద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతోంది.

    అన్నదమ్ములిద్దరితోనూ నటిస్తున్నప్పుడు చెప్పలేని భావోద్వాగానికి గురయ్యాననీ, సినిమాపై వారికి అవగాహన చాలా ఎక్కువనీ, అదే వారిని స్టార్ హీరోలను చేసిందని కాజల్ అభిప్రాయపడింది. తెలుగులో చరణ్-అల్లు అర్జున్ లతో నటించాననీ, ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించడమంటే అదో ప్రత్యేకతగా కన్పిస్తుందనీ కాజల్ చెప్పుకొచ్చింది.

    నాగచైతన్యతో 'దడ" సినిమాలో నటించిన తనాు, ఆయన తండ్రి నాగార్జునతోనూ నటించాలనుకుంటున్నాననీ, టాలీవుడ్ లో గ్లామర్ విషయంలో నాగార్జున తర్వాతే ఎవరైనా..అంటూ కాజల్ ఓ రేంజ్ లో నాగార్జునకి సోపేస్తోంది. 'దడ" సినిమా ప్రమోషన్ లో అస్సలు కన్సించని కాజల్, ఇప్పుడిప్పుడే మీడియా ముందుకొచ్చి చేస్తోన్న ఓవరాక్షన్ ని అక్కినేని అభిమానులు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు.

    English summary
    Remember Kajal was the heroine of Naan Mahaan Alla, which had Karthi, Surya’s younger brother, in lead role. She is really lucky to share the screen space with both of them as so far the only actress is Tamanna who acted with Surya and Karthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X