మహేష్ బాబుకు తమిళ హీరో సూర్య ‘ట్రీ’ ఛాలెంజ్!
హైదరాబాద్: ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. సాధారణ ప్రజల నుండి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల దాకా ఈ ఐస్ బెకెట్ చాలెంజ్ లో మునిగి తేలారు. ఆ తర్వాత మన రాష్ట్రంలో రైస్ బకెట్ చాలెంజ్ కూడా పుట్టుకొచ్చింది.
తాజాగా కొత్తగా ‘మై ట్రీ చాలెంజ్' అనే కొత్త కాన్సెప్టు పుటుకొచ్చింది. చెట్లు పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం అనే ఒక సదుద్దేశ్యంతో మొదలైన ఈ మై ట్రీ చాలెంజ్‌ను ప్రముఖ మళయాల నటుడు మమ్ముట్టి స్వీకరించి....సూర్య, విజయ్, షారుక్ ఖాన్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసారు.

ఈ చాలెంజ్ స్వీకరించిన సూర్య......మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసారు. మరి సూర్య విసిరిన ఈ మై ట్రీ ఛాలెంజ్‌ను మహేష్ బాబు త్వరలో స్వీకరించే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబు, సూర్య మధ్య మంచి స్నేహం ఉంది. సో...త్వరలో మహేష్ బాబు చెట్లు నాటుతూ కనిపించే అవకాశం ఉంది.
మహేష్ బాబకు ఈ ట్రీ చాలెంజ్ స్వీకరిస్తే....రాష్ట్రంలోని అభిమానులంతా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా మహేష్ బాబు సూర్య విసిరిన ‘ట్రీ' ఛాలెంజ్ స్వీకరించాలని ఆశిద్దాం. వీలైతే మీరు కూడా ఈ మై ట్రీ చాలెంజ్ స్వీకరించి మీ స్నేహుతులను కూడా చెట్లు నాటడం వైపు ప్రొత్సహించండి.


Click it and Unblock the Notifications











