బెల్లంకొండ బ్యానర్ లో సూర్య కొత్త చిత్రం
బెల్లంకొండ సురేష్ త్వరలో సూర్య నటించిన మాత్రన్ చిత్రం రైట్స్ తీసుకోనున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం 2012 సమ్మర్ కి విడుదల కానుంది.రంగం దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ఆయన సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య నటించిన తాజా చిత్రం సెవెంత్ సెన్స్ రీసెంట్ గా విడుదలైంది. ఆ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపినింగ్స్ ని తెచ్చుకుంది. అంతేగాక కలెక్షన్స్ సైతం తమిళనాడులో బాగున్నాయి. ఇక బెల్లంకొండ సురేష్ విషయానికి వస్తే ఆయన రీసెంట్ గా అజిత్ చిత్రం గాంబ్లర్ ని డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక రీమేక్ చేస్తున్న గంగ చిత్రం విడుదలకు సిద్దమైంది.
త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన బాడీగార్డ్ చిత్రానికి రీమేక్ అది. ఈ చిత్రంపై వెంకటేష్ బాగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రం అనంతరం నందినీరెడ్డి దర్సకత్వంలో సిద్దార్ధ హీరోగా చిత్రం నిర్మిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం బెల్లంకొండ సురేష్ కి బాగా కలిసి వచ్చింది. లారెన్స్ దర్సకత్వంలో వచ్చిన కాంచన చిత్రం, రామ్ హీరోగా చేసిన కందిరీగ రెండూ హిట్టవటం బెల్లంకొండ సురేష్ కి మరిన్ని చిత్రాలు చేసే దిశగా ప్రేరేపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











