»   » 250 కోట్లతో ‘బాహుబలి’ కొట్టే సినిమా తీస్తారట!

250 కోట్లతో ‘బాహుబలి’ కొట్టే సినిమా తీస్తారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో ఇప్పటి వరకు బాహుబలిని కొట్టే సినిమా రాలేదు. ఆ మాటకొస్తే బాలీవుడ్లోనూ నిర్మాణం పరంగా ఆ రేంజి భారీ సినిమా లేదు. అయితే త్వరలో అలాంటి సినిమా రాబోతోందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

'బాహుబలి'ని కొట్టే మైథలాజికల్ మూవీ చేయాలని తమిళ దర్శకుడు సుందర్.సి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సూర్య కథానాయకుడిగా భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి ఆయన సిద్ధమువతున్నట్లు, ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

తెండ్రాల్ ఫిలిమ్స్ సంస్థ తమ సంస్థలో 100వ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం సుందర్ స్క్రిప్టు పనిలో బిజీగా ఉన్నాడట. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు కానీ..... తెలుగు కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న తమిళ సినిమా రంగంలో బాహుబలి కొట్టే సినిమా తీయాలనే కోరిక మాత్రం బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ఇలానే 'పులి'సినిమా చేసి ఫెయిల్ అయ్యారు. ఇపుడు 250 కోట్లతో మరో ప్రయత్నం చేస్తున్నారు.

Surya next film with 250 cr budget?

మన బాహుబలి విషయానికొస్తే... ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ విజయవంతం కావడం, భారీ వసూళ్లు సాధించడంతో ప్రస్తుతం 'బాహుబలి-2' తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీంతో పాటు బాహుబలి టీం ఓ వైపు మొదటి పార్టును వివిధ దేశాల్లో, ఆయా భాషల్లో రిలీజ్ చేస్తూ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

బాహుబలి-ది బిగినింగ్ ఇండియాలో రూ. 650 కట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి పార్ట్-2 రూ. 1000 కోట్లు వసూళ్లను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

English summary
If the gossips from Kollywood's sources are to be believed yet another most expensive film is on pipeline. Tamil director Sundar C is planning a mythological entertainer with crazy hero Suriya in a lead role. Tendral Films will produce this film investing Rs.250 crores on the project. The scripting of the film is being done at the moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu