సూర్య-సమంత మూవీ డీటేల్స్...
హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం లో నిలిచిన సమంత కోలివుడ్ సూపర్ హీరో సూర్య సరసన నటించే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు నెలలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ఆగస్టు 21న ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఆగస్టు 21న బెంగుళూరు, మైసూరు సమీపంలో ఈచిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగనుంది.
సింగం-2 తర్వాత లింగుస్వామి, గౌతం మీనన్ లతో కలిసి చేసే రెండు ప్రాజెక్టుల్లో సమాంతరంగా నటించనున్నట్లు గతంలో సూర్య ప్రకటించినప్పటికీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో గౌతం మీనన్ దర్శకత్వంలో కమిటైన 'దృవ నచ్చిత్తిరం' సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు సూర్య. ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.
సింగం-2 భారీ విజయం సాధించడంతో సూర్య తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంత కాలం వరకు ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలను మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు సూర్య. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో చేయబోయే సినిమా కమర్షియల్ కోవకు చెందినదే అంటున్నారు.


Click it and Unblock the Notifications











