ఎన్నారై వ్యాపారవేత్త హత్యకేసులో నటుడు సూర్య ప్రకాశ్.. ఇరుక్కున్నది ఇలా..
టెలివిజన్ ఛానెల్ అధినేత, ప్రవాసాంధ్రుడు జయరాం చిగురుపాటి హత్యకేసు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ హత్య వెనుక ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే కారణమన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎన్నో వీడని చిక్కుముడులు కనిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు సూర్య ప్రకాశ్‌ను పోలీసులు విచారించడం చాలా ఆసక్తిగా మారింది. పోలీసుల దర్యాప్తులో తెలిసిన విషయాలు ఏమిటంటే..

కలియుగ సినిమా నిర్మాణం కోసం
నటుడు సూర్యప్రకాష్ తాజాగా ‘కలియుగ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో సహాయం కోసం రాకేష్ రెడ్డిని అభ్యర్థించాడు. రూ.25 లక్షలు అప్పు ఇవ్వాలంటూ కొద్ది నెలలుగా రాకేష్‌రెడ్డి వెంట తిరుగుతున్నాడు. డబ్బులు ఇవ్వడంలో జాప్య జరిగింది. దాంతో వారి మధ్య కలయికలు, ఫోన్ సంభాషణలు జరిగాయి.

అప్పుకోసం రాకేష్‌రెడ్డి చుట్టూ
ఇక కలియుగ ఆడియో విడుదల సమయం దగ్గరపడటంతో రాకేష్ రెడ్డిపై కొంత మేరకు ఒత్తిడి తెచ్చారు. దాంతో జనవరి నెలాఖరులో అప్పు ఇచ్చేందుకు హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే గతనెల (జనవరి 30న) రాకేష్‌రెడ్డి, సూర్యప్రకాష్ మాట్లాడుకొన్నారు. తన జయరాంను కారులో ఇంటికి తీసుకొస్తే అప్పు ఇస్తానని నమ్మించాడు.

జయరాం చిగురుపాటిని తోడ్కొనేందుకు
ఆర్థిక అవసరాలు డిమాండ్ చేయడంతో సూర్య ప్రకాశ్ రాకేష్ రెడ్డి చెప్పిన పనికి ఒప్పుకొన్నాడు. స్నేహితుడు కిషోర్‌తో కలిసి రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి.. అక్కడ నుంచి ముగ్గురు కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌కు చేరుకొన్నారు. వీణ పేరుతో జయరాంకు ఎస్సెమ్మెస్ పంపి కిషోర్‌తో రమ్మని చెప్పారు.

జయరాంను రాకేష్ రెడ్డికి అప్పగింత
కిషోర్, స్యూర్య ప్రకాశ్ ఇద్దరు కలిసి జయరాంను తీసుకొని రాకేష్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి తర్వాత అందర్నీ బయటికి పంపించాడు. జయరాంను ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి ఇంట్లో బంధించాడు. అనంతరం వారి మధ్య గొడవ జరిగడం, జయరాం మరణించడం జరిగింది'' అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











