»   » అయినా...రూ. 100 కోట్లు వసూలయ్యాయి!

అయినా...రూ. 100 కోట్లు వసూలయ్యాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ సూర్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '24' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి రెండు బాషల్లోనూ పెద్ద సినిమాల పోటీ ఎదరురైనా ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

Also Read: '24' సినిమా ఎందుకు వదలుకున్నారు? ఇదీ మహేష్ బాబు జవాబు!


తాజాగా 24 చిత్రం వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సూర్య కెరీర్లోనే ఇది తొలి 100 కోట్లు వసూలు చేసిన సినిమా కాగా, సమంత కెరీర్లో 100 కోట్లు వసూలు చేసిన మూడో సినిమా. గతంలో సమంత నటించిన తేరి, కత్తి చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్లు సాధించాయి.


Also Read: ఆ పత్రికకు వార్నింగ్ ఇచ్చిన హీరో సూర్య, ఏమైంది?


Surya's 24 collected 100 crs gross

24 చిత్రం తమిళనాట రూ. 40 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లు వచ్చాయి. యూఎస్ఏలో రూ. 10 కోట్లకు పైగటా వసూలు చేసింది. మలేషియాలో కూడా 1 మిలియన్ మార్క్ వసూలు చేసింది. ఓవర్సీస్ మొత్తం కలిసి రూ. 30 కోట్లు వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేరళలో కూడా రూ. 10 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో కూడా రూ. 20 నుండి 25 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చసాగుతోంది.


Also Read: ఆ హీరోలు నన్ను నమ్మలేదు! (24 డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇంటర్వ్యూ)


24 సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం... చక్కని స్క్రీన్ ప్లే ఉండటమే. ఎక్కడైనా ప్రేక్షకుడు చెప్పే విషయం అర్దం కాకపోయినా లేదా కథ ప్రకారం పదే పదే రిపీట్ అవుతున్న సీన్స్ ..రిపీట్ అని ప్రేక్షకుడు ఫీలైనా సినిమా ధడేల్ మంటుంది. కానీ 24 సినిమా విషయంలో అలా జరుగకుండా సూర్య సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథలు తెరకెక్కించాలంటే కేవలం దర్శకుడుకు తెలివి ఉంటే సరిపోదు.. దాన్ని కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతకు సైతం దమ్ము ఉండాలి. అది సూర్యలో ఉందని ఈ సినిమాతో తేలిపోయింది.

English summary
Surya's 24 film has collected more than 100 crs gross worldwide collections. This is the first film for Surya that crossed 100 crs mark and third 100 cr grosser for Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu