»   » స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయి నిర్మాతగా మారా: సూర్య (24 ఫోటోస్)

స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయి నిర్మాతగా మారా: సూర్య (24 ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా గురించిన వివరాలు వెల్లడించారు.

ఈ సందర్బంగా హీరో సూర్య మాట్లాడుతూ 'విక్రమ్ కుమార్ గారు నాలుగున్నర గంటల పాటు వండర్ ఫుల్ నేరేషన్ ఇచ్చారు. విన్న వెంటనే నాలుగున్నర గంటల నేరేషన్ మూవీని రెండున్నర గంటల పాటు ఎలా తీస్తావని అడిగాను. స్క్రిప్ట్ వినగానే బాగా ఇంప్రెస్ అయ్యి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారాను' అన్నారు.

'బడ్జెట్, టెక్నిషియన్స్ అనే విషయాలను పక్కన పెడితే కంటెంట్ పరంగా చాలా బలమున్న సినిమా. సినిమాటోగ్రాఫర్ తిరుణాకరసుగారు, చంద్రబోస్ గారి సాహిత్యం, ప్రవీణ్ ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ ఇలా అన్నీ విభాగాల్లో బెస్ట్ టీం కుదిరింది. నేను చేసిన మూడు క్యారెక్టర్స్ లో నాకు ఆత్రేయ క్యారెక్టర్ అంటే ఇష్టం. కచ్చితంగా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మూవీ అవుతుంది' అని సూర్య తెలిపారు.

స్లైడ్ షోలో ఫోటోస్, మరిన్ని వివరాలు...

మనం సినిమా వల్లే..

మనం సినిమా వల్లే..

కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ విక్రమ తీసిన ‘మనం' మూవీ చూసాను. శివకుమార్, సూర్య, కార్తీలతో తమిళంలో ‘మనం' సినిమా చేయమని విక్రమ్ కు ఫోన్ చేశాను. తను మాత్రం నా దగ్గర సూర్యకు తగిన విధంగా మంచి లైన్ వుందని చెప్పారు' అని తెలిపారు.

అరగంట కాస్తా..నాలుగు గంటలు..

అరగంట కాస్తా..నాలుగు గంటలు..


సూర్యకు కథ వినిపించడానికి అరగంట సమయం ఇప్పించమని అడిగారు. నేను సరేనని సూర్యతో మీటింగ్ అరెంజ్ చేశాను. అరగంట కాస్తా నాలుగున్నర గంటలు పట్టింది. కథను అంత బాగా నేరేట్ చేశాడు. నేరేషన్ కంటే పదిరెట్లు అద్భుతంగా సినిమాను డైరెక్ట్ చేశాడు అని కె.ఇ.జ్ఞానవేల్ రాజా తెలిపారు.

మూడు రోల్స్, ఐదు గెటప్స్

మూడు రోల్స్, ఐదు గెటప్స్

ఈ చిత్రంలో సూర్య మూడు రోల్స్, ఐదు గెటప్స్ లో అద్భుతంగా నటించాడు. సూర్య కెరీర్లో బెస్ట్ ఫిలిం అవుతుందని అంటున్నారంతా.

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...

ఈ కథను ఓకే చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాను అవసరమైనవి అందించిన సూర్యగారికి థాంక్స్. అలాగే ఈ సినిమా కోసం వర్క్ చేసిన రెహమాన్ గారికి థాంక్స్. సూర్యగారి కెరీర్ లోని టాప్ 5 మూవీస్ లో ఇదొక చిత్రమవుతుంది అన్నారు.

విఎఫ్ఎక్స్

విఎఫ్ఎక్స్

ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ ప్రధానంగా ఉంటాయి. అందుకోసం జూలియన్ అనే ఫారినర్ వర్క్ చేసి అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు అని దర్శకుడు తెలిపారు.

English summary
Photos of Telugu Movie 24 Press Meet event held at Hyderabad. Suriya and others graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu