twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య ‘బ్రదర్స్’కు 30 నిముషాలు కోత

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ద్వితీయార్ధం నిడివి ఎక్కువ అవ్వడంతో తొలిరోజు సినిమాకు కొంత డివైడ్ టాక్ వచ్చిన మాట నిజం. అందుకే సినిమా నిడివిలో 30 నిమిషాలు తగ్గించాం. స్క్రీన్‌ప్లేలో కూడా భారీగా మార్పులు చేశాం. ఈ మార్పులు జరిగాక సినిమాకు మంచి స్పందన వస్తోంది' అని బెల్లంకొండ సురేష్ అన్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అవిభక్త కవలలుగా సూర్య నటించిన సినిమా 'బ్రదర్స్'. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ అనువాద చిత్రానికి బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేశ్‌బాబు నిర్మాతలు. ఈ సినిమా రిలీజైన తొలిరోజే లెంగ్త్ ఎక్కువ ఉందని ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో వెంటనే నిర్మాతలు స్పందించి ఈ నిర్ణయం తీసుకుని సినిమాని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు.

    అలాగే ...''సామాజిక స్పృహతో తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావాలంటే కొంత సమయం పడుతుంది. 'రంగం' సినిమా కూడా నెమ్మదిగానే జనాల్లోకి వెళ్లింది. మొదటిసారి సినిమా చూసినప్పుడు నిడివి పెరిగిందేమో అనిపించింది. కానీ కుదించడానికి సమయం దొరకలేదు. అలాగే విడుదల చేశాం. తొలి రోజు సినిమాకి మిశ్రమ స్పందన వచ్చిన మాట నిజమే. రెండోరోజు దాదాపు ముఫ్పై నిమిషాల పాటు సన్నివేశాలను కుదించాం. దాంతో.. కథనంలో వేగం వచ్చింది. విలన్ ఎవరో క్లైమాక్స్ సన్నివేశాల వరకూ తెలీదు'' అన్నారు.

    ఇక ''ప్రస్తుతం మన జీవితాలన్నీ కల్తీమయం అయిపోయాయి. దేశంలో ఎక్కడ చూసినా కల్తీ. విదేశాల నుంచి టెక్నాలజీతో పాటు, కల్తీ కూడా మనదేశానికి దిగుమతి అవుతోంది. ఆఖరికి చిన్నపిల్లలు తాగే పాలు కూడా స్వచ్ఛంగా లేవు. పిల్లలు తినే పాల పొడిని కూడా కల్తీ చేస్తున్న పరిస్థితి నేడు నెలకొంది. ఆ విషయాన్నే మా సినిమాలో చూపించాం. దైనందిన సమస్య కాబట్టే.. ప్రేక్షకులు కథలో త్వరగా లీనమయ్యారు'' అన్నారు బెల్లంకొండ సురేష్‌. ఈ సమావేశంలో శశాంక్‌ వెన్నెలకంటి, మల్టీడైమన్షన్‌ వాసు పాల్గొన్నారు.

    కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ఎస్.సౌందర్యరాజన్, ఎడిటింగ్: ఆంథోని, పాటలు: చంద్రబోస్, వనమాలి, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, సమర్పణ: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

    English summary
    
 As per the latest reports, the makers of Surya’s latest action entertainer ‘Brothers’ decided to chop the film length for 30 minutes. It is learnt that, after taking feedback from theaters, the film unit applying few cuts for about 30 minutes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X