»   »  సూపర్ కాంబినేషన్: త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య!

సూపర్ కాంబినేషన్: త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు తెలుగు స్టార్ హీరోలకు సమానంగా ఆయన సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంటుంది. అయితే సూర్య మాత్రం ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదు. ఆ మధ్య తన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సూర్య మంచి కథ దొరికితే త్వరలోనే తెలుగులో స్ట్రైట్ సినిమా చేయబోతన్నట్లు వెల్లడించారు.

ఎట్టకేలకు సూర్య కోరిక నేరవేరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఇటీవల సూర్యను కలిసి ఓ కథ చెప్పినట్లు సమాచారం. సూర్య కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు టాక్. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

Surya's next film with Trivikram

అన్ని సజావుగా జరిగితే 2016లో సూర్య-త్రివిక్రమ్ చిత్రం మొదలవుతుందని చెన్నై టాక్. త్రివిక్రమ్ సినిమాలకు తెలుగులో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టడం ఖాయం అంటున్నారు.

English summary
Film Nagar source said that, Surya's next film with Trivikram.
Please Wait while comments are loading...