సూర్య ఎస్3 (సింగం-3) ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

By Bojja Kumar

హైదరాబాద్: తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.

ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్‌తో పాటు తెలుగు వెర్షన్ టీజర్‌కు కూడా అద్భుత స్పందన లభిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్ తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌కు ఎస్-3 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు దాదాపుగా టీజర్ ఒక కోటి వ్యూస్ సాధించింది.

ఆడియో రిలీజ్ డేట్

ఆడియో రిలీజ్ డేట్

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని తెలిపారు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలవబోతుందని నిర్మాత శివకుమార్ అన్నారు.

సూర్య నట విశ్వరూపం

సూర్య నట విశ్వరూపం

ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అన్నారు.

rn

రిలీజ్ డేట్

డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X