మాఫియా,మోసం,ప్రతీకారం( 'సికిందర్' ప్రివ్యూ)

రాజూ భాయ్ (సూర్య) అనే డాన్ కథ ఇది. చీకటి ప్రపంచాన్ని చిటికె వేసి నడిపించే తెలవితేటలు, దమ్ము ఉన్నవాడు. స్నేహానికి ప్రాణమిస్తాడు. అలాంటి రాజూ భాయ్‌ని స్నేహం పేరుతో మోసగిస్తే ఎలా స్పందించాడు? తన పగను ఎలా, ఏ రూపంలో తీర్చుకొన్నాడు అనేదే కథ. రాజుభాయ్‌కి ఓ ప్రేమ కథ ఉంది. అదేంటో తెరపై చూడాల్సిందే.
సూర్య మాట్లాడుతూ...''లింగుస్వామితో ఎప్పుడో చేయాల్సింది..కుదర్లేదు. ఈ సారి నాలుగైదు కథలు సిద్దం చేశాడు. అందులో ఉత్తమమైన స్క్రిప్టు ఇదే. ఇదో స్త్టెలిష్ డాన్ కథ. డాన్ పాత్ర చేయడంలో ఎంత మజా ఉందో తెలిసొచ్చింది. తప్పకుండా అందరినీ ఆకట్టుకొనే చిత్రం అవుతుంది. మాస్‌కి మరీ మరీ నచ్చుతుంది'' అని చెప్పారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ... ''రివేంజ్ డ్రామాను స్త్టెలిష్‌గా తీశాం. రజనీకాంత్‌కి 'బాషా', కమల్‌హాసన్‌కి 'నాయకుడు' ఎలానో సూర్యకి 'సికిందర్' అలాంటి సినిమా అవుతుంది. సమంత అందచందాలు మరో ప్రధాన ఆకర్షణ. సంతోష్ శివన్ కెమెరా పనితనం, యువన్ సంగీతం ప్రధాన బలం'' అన్నారు.
చిత్రం: సికిందర్
సంస్థ: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
నటీనటులు: సూర్య, సమంత, విద్యుత్ జమాల్, బ్రహ్మానందం, మనోజ్‌బాజ్‌పాయ్, మురళీశర్మ తదితరులు.
సంగీతం: యువన్ శంకర్‌రాజా
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
CBFC రేటింగ్: U
రన్ టైమ్: 170 నిముషాలు
నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్
సమర్పణ : యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లింగుస్వామి
విడుదల తేది: 15 ఆగస్టు,2014.


Click it and Unblock the Notifications











