రాజమౌళికి సారీ, సికిందర్ ఆడియో వేడుకలో సూర్య (ఫోటోలు)
హైదరాబాద్: తమిళ స్టైలిష్ స్టార్ హీరో సూర్య, సమంత జోడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సికిందర్. రామలక్ష్మి క్రియేషన్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా ఈ సినిమాని అందిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో గురువారం హైదరాబాద్ లో విడుదలైంది. అక్కినేని నాగార్జున ఆడియో సీడీలను ఆవిష్కరించగా రాజమౌళి సీడీలను అందుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్స్ రాజమౌళి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ.... 'నేను లైఫ్ లో ఏదైనా పెద్ద తప్పు చేశానంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చినా నటించకపోవడం. అందుకు నేను ఇపుడు సారీ చెబుతున్నాను. ఇప్పుడు నేను ఆయన సినిమా బాహుబలిలో సింగిల్ షాట్ అయినా నటించాలనుకుంటున్నాను. జస్ట్ ఫోన్ చేస్తే చాలు. నేను రెడీ. నాగార్జున, లింగుస్వామిలు ఇద్దరూ కూల్ గా ఉంటారు. ఎక్కడా టెన్షన్ పడరు. ఈ సినిమాలో మంచి టీమ్ తో పనిచేశాను. ఫస్ట్ టైమ్ నేను చేస్తున్న స్టైలిష్ మూవీ. యువన్ సంగీతం, సంతోష్ శివన్ కెమెరావర్క్ సినిమాకి ప్లస్ అవుతాయి. లగడపాటి హ్యపీయెస్ట్ పర్సన్. ఈ సినిమాతో తను ఇంకా హ్యపీయెస్ట్ పర్సన్ కావాలి'' అని తెలిపారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

సూర్య గురించి నాగార్జున
నాగార్జున మాట్లాడుతూ...''సూర్య మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. చెన్నయ్ లో నేను పాల్గొన్న ఓ కార్యక్రమానికి సూర్య, జ్యోతిక చాలా హెల్ప్ చేశారు. తెలుగులో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఇక, సమంత గురించి చెప్పాలంటే తను నటిస్తున్న చిత్రాలన్నీ విజయం సాధిస్తున్నాయి.

లింగు స్వామి గురించి నాగ్
నాకు లింగుస్వామి సినిమాలంటే ఇష్టం. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన 'వేట్టయ్' తెలుగు రీమేక్ 'తడాఖాలో నాగచైతన్య నటించాడు. లింగుస్వామి దర్శకత్వంలో నాకో సినిమా చేయలని ఉంది. ఒకవేళ ఆయన నాతో సినిమా చేస్తే 'శివ' చిత్రంలోలా మళ్లీ చైన్ లాగాలని ఉంది'' అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ..
"ఈ చిత్రం స్టిల్స్ చూసి, సూర్యని పొగడాలనిపించింది. ట్రైలర్స్ చూశాక లింగుస్వామిని పొగడాలనిపించింది. అంత బాగున్నాయి. ఈ ఆడియో ఆల్బమ్ లో నాకు 'బ్యాంగ్ బ్యాంగ్..' పాట బాగా నచ్చింది. ఒక కమర్షియల్ హీరో గా చేస్తూ విబిన్నమైన గెటప్స్ చేయడం సూర్య ప్రత్యేకత'' అని చెప్పారు.

లింగు స్వామి మాట్లాడుతూ...
''నా కాలేజ్ డేస్ లో 'శివ' చూశాను. అప్పుడు ఎలా ఉన్నారో నాగార్జున ఇప్పుడూ అలానే ఉన్నారు. సౌత్ లో 100 కోట్లకు రీచ్ అయ్యే సూర్య వంటి హీరోతో సినిమా చేసేటప్పుడు కథ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మేం అనుకున్న మూడు కథల్లో 'సికిందర్' ఆయనకు నప్పుతుందని ఈ సినిమా చేశాం. రెండు పాత్రలు చేశారాయన. సూర్య పాత్రలు చాలా స్టయిలిష్ గా ఉంటాయి. సూర్య, సమంతల జోడి చాలా బాగుంటుంది. పాటలు, ఫొటోగ్రఫీ.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి'' అని చెప్పారు.

సికిందర్ విడుదల తేదీ
'సికిందర్' అద్భుతమైన చిత్రమని, కథ చాలా గొప్పగా ఉంటుందని లగడపాటి శిరీషా శ్రీధర్ అన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











