జూన్ 23న సూర్య ‘సింగం’ ఆడియో
హైదరాబాద్ : సూర్య-అనుష్క జంటగా అప్పట్లో విజయవంతం అయిన తమిళ చిత్రం 'సింగం' తెలుగులో 'యముడు' పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు నాట కూడా ఈచిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా తమిళంలో 'సింగం' చిత్రానికి సీక్వెల్‌గా 'సింగం-2' చిత్రాన్ని రూపొందించారు.
'సింగం-2' చిత్రం ఇప్పుడు తెలుగులో 'సింగం' పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సూర్య, అనుష్కతో పాటు హన్సిక కూడా నటిస్తోంది. హీరోయిన్ అంజలి ఇందులో ఐటం సాంగులో ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. ఈ చిత్రం ఆడియో జూన్ 23న గ్రాండ్‌గా విడుదల చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ....'జూన్ 23న ఆడియో విడుదల చేసిన, జులై 5న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, యముడు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అంతుకు మంచిన విజయాన్ని సింగం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
హరి దర్శకత్వంలోప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నూతన నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications











