»   » పవర్ ఫుల్‌ పాత్రలో ఝాన్సీగా జ్యోతిక.. 17న విడుదల!

పవర్ ఫుల్‌ పాత్రలో ఝాన్సీగా జ్యోతిక.. 17న విడుదల!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధమవుతున్నది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ ఆగస్టు 17న రిలీజ్ కానున్నది. కోనేరు కల్పన, డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర టీజర్‌ను ఇటీవల సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

  Suryas wife Jyothika as Jhansi

  విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయినా శివపుత్రుడు, విశాల్ తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాలఈ చిత్రాన్ని తమిళంలో నాచియార్ అనే పేరుతో తెరకెక్కించారు. తమిళంలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో జ్యోతిక నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. తెలుగులో ఝాన్సీ పేరుతో ఆగష్టు 17న విడుదలకు సిద్ధం గా ఉంది. ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్. జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు.

  Suryas wife Jyothika as Jhansi

  ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ "నాచియార్ చిత్రం తమిళం లో ఘన విజయం సాధించింది. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల దర్శకత్వం నిర్మించబడింది. జ్యోతిక తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయటం చాలా ఆనందం గా ఉంది అని తెలిపారు. ఈ చిత్రంలో బాలా దర్శకత్వం ఒక ఎత్తు అయితే జ్యోతిక నటన మరో ఎత్తు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. బయర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది" అని తెలిపారు.

  English summary
  After long gap, Surya's wife Jyothika re entry into tollywood. She is coming with Jhansi, which remake of Nachiyar Tamil movie. This teaser was launched by Tollywood hero Sudheer Babu. This film is set to release on August 17th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more