సూర్య, శృతిల..‘7th సెన్స్’ లోగో విడుదల
సూర్య, శృతి హాసన్ జంటగా నటిస్తున్న '7th సెన్స్" సినిమా లోగోను శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణ లో ఆవిష్కరించారు. తమిళంలో రూపొందిన '7ఎఎం అరివు" చిత్రాన్ని తెలుగులో '7th సెన్స్" పేరుతో అనువదించారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను లక్ష్మి గణపతి ఫిలింస్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు. సూర్య ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలో సర్రస్ కళాకారుడిగా కనిపించ బోతున్నాడు.
లోగో విడుదల సందర్భంగా మురుగదాసు మాట్లాడుతూ గతంలో మా కాంబినేషన్ లో వచ్చిన గజిని సినిమా కంటే ఇది ఇంకా బాగా వచ్చిందన్నారు. ఈ నెలలో ఆడియో విడుదల చేసి, దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్య్రకమంలో సూర్య, శృతి హాసన్, టాలీవుడ్ దర్శకులు సుకుమార్, మెహర్ రమేష్, బోయపాటి శ్రీను, నిర్మాత బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











