సూర్య-సోనమ్..రవితేజ-తాప్సీ
సూర్య, రవితేజ కాంబినేషన్లో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రధాన హీరో కాగా, రవితేజ సెకండ్ హీరోగా కనిపించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన సోనమ్ కపూర్, రవితేజ సరసన తాప్సీ ఖరారు అయినట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం సూర్య కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.కాజల్ హీరోయిన్. ఈ చిత్రం పూర్తయిన తర్వాత వెంకట్ ప్రభు-సూర్య చిత్రం ప్రారంభం కానుంది. రవితేజ ప్రస్తుతం దరువు చిత్రంలో నటిస్తున్నాడు, దీని తర్వాత పూరి జగన్నాథ్ తో దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించనున్నాడు. ఇవి పూర్తయిన తర్వాత వెంకట్ ప్రభు చిత్రంలో జాయిన్ కాబోతున్నాడు.
ఇప్పటి వరకు తెలుగుకు మాత్రమే పరిమితం అయిన రవితేజ....మెల్లి మెల్లిగా తమిళంలోనూ తన మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంకట్ ప్రభు సినిమాలో సూర్య మెయిన్ హీరో అయినప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











