»   » తొలిసారి పొలిమేర దాటుతున్న త్రివిక్రమ్: ఆ స్టార్ హీరోతో నెక్ట్స్!

తొలిసారి పొలిమేర దాటుతున్న త్రివిక్రమ్: ఆ స్టార్ హీరోతో నెక్ట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు తెరపై మరో సరికొత్త స్టార్ కాంబినేషన్ రాబోతోంది. ఇప్పటి వరకు తెలుగు హీరోలైన మహేశ్, పవన్, బన్నీ వంటి తెలుగే హీరోలతోనే రిపీటెడ్ సినిమాలు చేసిన ఆయన తొలిసారి తెలుగు పొలిమేర దాటబోతున్నాడు. సూర్య హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అ.. ఆ.. సినిమా తర్వాత 2016 ఏడాది సమ్మర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

Trivikram Srinivas

అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తితో పాటు ప్రస్తుతం తెరకెక్కుతున్న అ..ఆ సినిమాలోనూ సమంతను తీసుకున్న త్రివిక్రమ్ సూర్యతో చేసే సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమా కావడంతో సమంత అయితేనే మంచి ఆప్షన్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు టాక్. అదే నిజమైతే సమంతతో త్రివిక్రమ్ నాలుగోసారి కలిసి పని చేయబోతున్నాడన్నమాట.

Surya

‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) సినిమా వివరాల్లోకి వెళితే...రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో నితిన్ ఇద్దరు హీరోయిన్లతో డ్యూయోట్లు పాడుతున్నారు.

samantha

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం, యువత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు.

English summary
Actor Surya is set to team up with Telugu filmmaker Trivikram Srinivas for a yet-untitled Telugu-Tamil bilingual, which is most likely to go on the floor next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu