సూర్య, త్రిష జంటగా తెలుగులో కంచు
సూర్య, త్రిష జంటగా తమిళంలో రూపొందిన మౌనం పేసిదే చిత్రాన్ని తెలుగులోకి ఎస్.ఎస్. కమ్యునికేషన్స్ అనువదిస్తోంది. సూర్య త్రిష తెలుగులో బాగా పాపులర్ కావడంతో ఈ సినిమా డైరెక్ట్ సినిమాల రేంజిలో ఆడుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. సూర్యకు గజిని చిత్రం ఎంతటి పేరు లభించిందో ఈ సినిమా కూడా ఆయనకు అంతటి పేరు సంపాదించి పెట్టింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాం అని నిర్మాత వి.రామ్ తెలిపారు.
ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించారని, దీనిని నూతన దర్శకుడు అమిర్ ఎంతో అనుభవమున్న డైరెక్టర్‌గా తెరకెక్కించారని, ప్రతి సన్నివేశం ఆకట్టుకొనేలా సాగుతుందని ఆయన అన్నారు. "ప్రేమంటేనే ఇష్టంలేని హీరో ప్రేమలో పడతాడు. తరువాత ప్రేయసి ఛీత్కారానికి గురవుతాడు. ఆపై అతను ప్రేమలో ఎలా విజయం సాధించాడన్నదే ఈ చిత్రకథ అని ఆయన వివరించారు.
ఈ చిత్రాన్ని జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు. ఇందులోని ఆరు పాటలకు యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారని, తెలుగులో కూడా పాటలు అందరినీ అలరిస్తాయని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











