తమ్ముడు కార్తి బాటలో హీరో సూర్య
తమిళ హీరో సూర్యకు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సూర్య నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే సారి విడుదల అవుతుంటాయి. సూర్య తమ్ముడు కార్తి కూడా అన్నయ్యకు ఏమాత్రం తీసిపోకుండా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ రాణిస్తున్నాడు. అయితే అన్నయ్య సూర్య కంటే తమ్ముడు కార్తీలో ఓ అదనపు క్వాలిపికేషన్ ఉంది. అదేమిటంటే...సూర్య కేవలం తమిళంలో మాత్రమే తన వాయిస్‌కు డబ్బింగ్ చెప్పుకోగలడు. అయితే కార్తి మాత్రం మాతృ బాష తమిళంతో పాటు ఇటు తెలుగు భాషను కూడా అవలీలగా దంచేస్తాడు.
దీంతో సూర్య కూడా తమ్ముడు బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. తన తర్వాతి సినిమాకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటానని సెవెన్త్ సెన్స్ ఆడియో ఫంక్షన్లో ప్రకటించి సూర్య..తన తాజా సినిమా 'డూప్లికేట్' (తమిళంలో మాత్రన్) లో తెలుగు డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో సూర్య సరసన కాజల్ నటిస్తోంది.
కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











