»   » క్లీన్ ‘యు’ వచ్చింది...ఇక కుమ్మేసుకోవటమే

క్లీన్ ‘యు’ వచ్చింది...ఇక కుమ్మేసుకోవటమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నిఖిల్, త్రిధా చౌదరి జంటగా నటించిన సినిమా ‘సూర్య వర్సెస్ సూర్య'. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ ‘యు' సర్టిఫికేట్ లభించింది. మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


పగలు బయటకు రాలేని ఓ కుర్రాడు.. పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు. అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సూర్య కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నేను నటించాను. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అని హీరో నిఖిల్ తెలిపారు.


నిఖిల్‌ మాట్లాడుతూ ''తొలిసారి ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంలో నటించాను. 'స్వామిరారా' హోలీ రోజున విడుదలైంది. 'కార్తికేయ' దీపావళికి వచ్చింది. పండగ రోజున విడుదలైన రెండు సినిమాలూ మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాన్నీ హోలీ రోజునే తీసుకొస్తున్నాం'' అన్నారు.


Surya Vs Surya awarded 'U' certificate

దర్శకుడు చెబుతూ ''సత్యమహావీర్‌ అందించిన పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. సూర్యుడికీ, సూర్యకీ జరిగే సంఘర్షణ అందరినీ ఆకట్టుకొంటుంది''అన్నారు.


''చిత్రబృందం అంతా కష్టపడింది. 'ఇది మన సినిమా' అనుకొని పనిచేశారు. దర్శకుడు కథ ఎంత బాగా చెప్పాడో, దానికంటే వంద రెట్లు బాగా తీశాడు''అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో చందూ మొండేటి, సత్య, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.


సూర్యకు శత్రువు సూర్యుడే. ఆ కిరణాలు చురకత్తుల్లా వెంటాడుతుంటాయి. యమపాశంలా భయపెడతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా అనే విషయాలు తెలియాలంటే 'సూర్య వర్సెస్‌ సూర్య' చూడాల్సిందే.


‘స్వామి రా రా', ‘కార్తికేయ' అంటూ డిఫెంరెంట్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన నిఖిల్ మరో విభిన్న కాన్సెప్టు తో ముందుకు వస్తున్న చిత్రం సూర్య vs సూర్య'. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపద్యంలో ఈ చిత్రం విడుదల తేదీ బయిటకు వచ్చింది. మార్చి 6 న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏప్రియల్, మే నెలలో వరస పెట్టి పెద్ద చిత్రాలు వస్తూన్న నేపధ్యంలో ఈ తేదీ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. . ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వస్తున్నా ఈ సినిమా ద్వారా త్రిద చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మల్కాపురం శివకుమార్ నిర్మాత.


నిఖిల్ మాట్లాడుతూ... "సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు' అని ట్వీట్ చేసాడు. అందుకు తగినట్లే పోస్టర్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి.


కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


‘హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘కార్తికేయ' దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో నిఖిల్ హట్రిక్ పై కన్నేశారు.

English summary
Talented hero Nikhil’s latest movie “Surya vs Surya” has finally got censored . Censor officials have awarded the flick a cool ‘U’ certificates with some advises over the content.
Please Wait while comments are loading...