»   »  ఆ పత్రికకు వార్నింగ్ ఇచ్చిన హీరో సూర్య, ఏమైంది?

ఆ పత్రికకు వార్నింగ్ ఇచ్చిన హీరో సూర్య, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ సూర్యకు తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం నటన మాత్రమే కాదు... మంచి నడవడిక, వ్యక్తిత్వం, సేవాభావం ఇలా అన్ని కలిసి సూర్యకు ఒక యూనిక్ గుర్తింపు తెచ్చి పెట్టాయి, పెద్ద స్టార్ ను చేసాయి.

ఎప్పుడూ చిరు నవ్వుతో ప్రశాంతంగా కనిపించే సూర్య ఇటీవల తన గురించి ఓ పత్రికలో వచ్చిన వార్త సంగతి తెలిసిందే ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ పత్రికకు వార్నింగ్ ఇస్తూ ప్రెస్ రిలీజ్ జారీ చేసారు.

సూర్య ఆగ్రహానికి గురి కావడానికి కారణం మలేషియాకు చెందిన పత్రిక. మలేషియా దేశంలో తమిళ జనాభా ఎక్కువే. అక్కడ తమిళ స్టార్లకు మంచి ఫాలోయింగే ఉంది. పలువురు స్టార్లు తరచూ మలేషియాలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు కూడా.

Surya warns Malaysian daily

అయితే ఇటీవల ఓ మతపరైమన సంస్థ తమ కార్యక్రమంలో పాల్గొనడానికి సూర్యను ఆహ్వానించిందని.. సూర్య అందుకోసం డబ్బులు డిమాండ్ చేశాడని మలేషియాకు చెందిన ఓ పత్రిక కథనం రాసింది.

తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ వార్త ఉండటంతో దీన్ని సూర్య సీరియస్ గా తీసుకున్నాడు. ఆ పత్రికకు వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు సూర్య. తాను మత పరమైన కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనని, మలేషియాలో ఏ కార్యక్రమానికీ తనను ఎవరూ ఆహ్వానించలేదని చెప్పాడు. తన గురించి ఇలాంటి నిరాధార వార్తలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని అతను హెచ్చరించాడు. ః

Read more about: surya సూర్య
English summary
A recent article in a popular Malyasian daily has reported that actor Suriya has demanded a huge sum of money.. to attend a religious event there in Malaysia. Suriya who seems to be much shocked with this news has immediately released a press release stating that he was not approached for this, and he added that he has a policy to never opt to participate in any religious events.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu