సూర్య, అనుష్కల 'యముడు' రిలీజ్ డేట్

By Srikanya

సూర్య, అనుష్క జంటగా నటించిన 'యముడు' చిత్రం వచ్చే నెల 2న రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో 'సింగం' టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది.తమిళ దర్శకుడు హరి డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌ వేల్‌ రాజా తెలుగుకు అనువదించారు. నీతి, నిజాయతీలే ఆయుధాలుగా పోలీసు డిపార్టమెంట్ లోకి అడుగుపెట్టిన ఓ కుర్రాడుకి ఎదురయ్యే సవాళ్ళే ఈ చిత్రం. తమిళంలో రూ.85 కోట్లకు పైగా రెవిన్యూ సాధించిన ఈ చిత్తరంలో విలన్ గా ప్రకాష్ రాజ్ చేసారు. గజనీ చిత్రం తర్వాత ఆ రేంజిలో ఉన్న సూర్య చిత్రం ఇది. అలాగే అనుష్క ఈ చిత్రంలో రెచ్చిపోయి చేసిన డాన్స్ లు యూత్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. తెలుగు వెర్షన్ కు శశాంక్‌ వెన్నెలకంటి మాటలు అందిస్తే, పాటలు సాహితి రాసారు. కెమెరా...ప్రియన్‌, ఎడిటింగ్... వి.టి.విజయన్‌ అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించటం మరో విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X