twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక!

    |

    మెగాడాటర్ నిహారిక కొణిదెల నటించిన 'సూర్యకాంతం' చిత్రం మార్చి 29న విడుదల కాబోతోంది. నిహారిక ఇప్పటి వరకు నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

    ప్రమోషన్లో భాగంగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నిహారిక సినిమా అంటే బోరింగ్ సబ్జెక్ట్ తప్ప ఏమీ ఉండదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఈ ట్రైలర్ అలాంటి అభిప్రాయాన్ని తొలగించింది.

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ

    అభి, సూర్యకాంతం, పూజ మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ప్రేమ సంఘర్షణను రొటీన్‌కు భిన్నంగా ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా తెరకెక్కించారు.

    సూర్యకాంతం

    సూర్యకాంతం

    పేరుకు తగ్గట్లే ఈ చిత్రంలో సూర్యకాంతం క్యారెక్టరైజేషన్ ఉండనుంది. డామినేటింగ్, గయ్యాలి అమ్మాయిగా నిహారిక కనిపించబోతోంది. పాత్రకు తగిన విధంగా నిహారిక బాడీ లాంగ్వేజ్ ఉండటంతో ట్రైలర్ మెప్పిస్తోంది.

    మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక

    మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక

    ట్రైలర్ చివర్లో నిహారిక మిడిల్ ఫింగర్ చూపిస్తూ సీరియస్ లుక్ ఇవ్వడం హైలెట్. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన రాహుల్ విజయ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయమైన పాత్రలో అతడి నటన మెప్పించే విధంగా ఉంటుందని ట్రైలర్‌తో తేలిపోయింది.

    సూర్యకాంతం

    ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బేనర్లో సందీప్ యర్రంశెట్టి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ ‘సూర్యకాంతం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Checkout Suryakantam Trailer ft. Niharika, Rahul Vijay. Written and Directed by Pranith Bramandapally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X