Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక!
మెగాడాటర్ నిహారిక కొణిదెల నటించిన 'సూర్యకాంతం' చిత్రం మార్చి 29న విడుదల కాబోతోంది. నిహారిక ఇప్పటి వరకు నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
ప్రమోషన్లో భాగంగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నిహారిక సినిమా అంటే బోరింగ్ సబ్జెక్ట్ తప్ప ఏమీ ఉండదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఈ ట్రైలర్ అలాంటి అభిప్రాయాన్ని తొలగించింది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ
అభి, సూర్యకాంతం, పూజ మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ప్రేమ సంఘర్షణను రొటీన్‌కు భిన్నంగా ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా తెరకెక్కించారు.
సూర్యకాంతం
పేరుకు తగ్గట్లే ఈ చిత్రంలో సూర్యకాంతం క్యారెక్టరైజేషన్ ఉండనుంది. డామినేటింగ్, గయ్యాలి అమ్మాయిగా నిహారిక కనిపించబోతోంది. పాత్రకు తగిన విధంగా నిహారిక బాడీ లాంగ్వేజ్ ఉండటంతో ట్రైలర్ మెప్పిస్తోంది.
మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక
ట్రైలర్ చివర్లో నిహారిక మిడిల్ ఫింగర్ చూపిస్తూ సీరియస్ లుక్ ఇవ్వడం హైలెట్. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన రాహుల్ విజయ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయమైన పాత్రలో అతడి నటన మెప్పించే విధంగా ఉంటుందని ట్రైలర్‌తో తేలిపోయింది.
సూర్యకాంతం
ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బేనర్లో సందీప్ యర్రంశెట్టి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ ‘సూర్యకాంతం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.