పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్,నయనతార,జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం మణి చిత్రతరాజు అనే మళయాళ చిత్ర రీమేక్. అప్పట్లో ఫాజిల్ ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసారు.ఆ చిత్రం ఇంతకాలానికి సౌత్ లో రీమేక్ అయి సంచలనం సృష్టించటంతో ఆయన అదే తరహాలో మరో సైక్లాజికల్ థీమ్ తో ఓ చిత్రాన్ని రూపొందించారు.దీనికి క్రేజ్ కోసం నయనతారను కథానాయికగా ఎన్నుకున్నారు.ఆ సినిమాని ఇప్పడు తెలుగు నిర్మాతలు డబ్బింగా చేసి 'సూర్యముఖి'పేరుతో ఈ నెలలో విడుదల చేస్తున్నారు. మలయాళంలో రూపొంది విజయం సాధించిన ఈ చిత్రాన్ని సాయినవీన్ క్రియేషన్స్ పతాకంపై కోటేశ్వరరావు, టి.క్రాంతికుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు చెబుతూ, 'ఈ సినిమా కూడా 'చంద్రముఖి' తరహాలోనే సైకలాజికల్ బేస్డ్ సబ్జెక్ట్. ఎవరికీ కనిపించకుండా, హీరోకి మాత్రమే కనిపించే 'సూర్యముఖి' కేసును సైకియాట్రిస్ట్ మోహన్‌లాల్ ఎలా ట్రీట్ చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పొన్నప్పచ్చన్, మాటలు: జయప్రసాద్, నిర్వహణ: రామకృష్ణ.